రైలుబడి
ప్రముఖ భాషలన్నింటిలోకి అనువదించబడిన టెట్సుకొ...
Also Available in:
- Amazon
- Audible
- Barnes & Noble
- AbeBooks
- Kobo
More Details
ప్రముఖ భాషలన్నింటిలోకి అనువదించబడిన టెట్సుకొ కురొయనాగి అద్భుత రచన.
'టోమో అనే బడి గురించి, దాన్ని స్థాపించి, నడిపిన సొసాకు కొబయాషి అనే వ్యక్తి గురించి రాయడం నేను ఎన్నాళ్లుగానో చేయదలచుకున్న పనుల్లో ఒకటి. నేను చిన్నప్పుడు ఆ బడిలోనే చదువుకున్నాను. ఇందులో ఏ సంఘటననూ కల్పించలేదు. అన్నీ నిజంగా జరిగినవే.
'1945లో టోక్యోపై జరిగిన బాంబుదాడుల్లో టోమో నాశనమైపోయింది. అప్పటికి కొబయాషి దాన్ని తన స్వంత డబ్బుతో నిర్మించాడు. అందువల్ల పునర్నిర్మాణానికి ఎక్కువ వ్యవధి తీసుకుంది. యుద్ధం తర్వాత పాత స్థలంలోనే ఆయన ఒక కిండర్ గార్టెన్ని ప్రారంభించాడు. కొబయాషి 1963లో చనిపోయాడు.
'ఇప్పుడు ఆ స్థలంలో పీకాక్ అనే సూపర్ మార్కెట్ వుంది. టోమో గానీ దాని ఆవరణ గానీ ఏమీ మిగలలేదు. అయినా పాత జ్ఞాపకాల ఉద్వేగంతో నేను ఒక రోజు అక్కడికి వెళ్లాను. ఒక మహా విషాదం నన్ను ఆవరించింది. నా చెక్కిళ్ల మీద కన్నీళ్లు వరద కట్టాయి.
'నేను టోమోలో గడిపిన కాలం కొబయాషిలో ఉత్సాహం పొంగులెత్తున్న కాలం. ఆయన పథకాలు నిండుగా వికసిస్తున్న కాలం. యుద్ధం రాకుండావుంటే ఆయన సంరక్షణలోకి ఇంకా ఎంతెంత మంది చిన్నారి బాలలు వచ్చి ఉండేవారో తలచుకుంటే, ఎంత కృషి వ్యర్థమై పోయిందో కదా అని అంతులేని విచారం ఆవహిస్తుంది.
'నేనీ పుస్తకంలో కొబయాషి విద్యాబోధనా పద్ధతులను వర్ణించడానికి ప్రయత్నించాను. పిల్లలందరూ ఒక స్వతసిద్ధమైన ఉత్తమ స్వభావంతో జన్మిస్తారని ఆయన నమ్మకం. ఈ మంచితనమంతా వాళ్ల వాతావరణం వల్లా, వాళ్ల మీద పెద్దల తప్పుడు ప్రభావాల వల్లా అతి సులభంగా ధ్వంసమై పోతుందని ఆయన అభిప్రాయం. ఆ మంచి స్వభావాన్ని వెలికి తీసి, అభివృద్ధిచేయడమే ఆయన లక్ష్యం. తద్వారా పిల్లల్ని వ్యక్తిత్వం గల మనుషులుగా తీర్చిదిద్దడం ఆయన ఆశయం.
'టోమోలాంటి పాఠశాలలు గనుక ఇప్పుడున్నట్టయితే ఇవాళ మన సమాజంలో హింసా ప్రవృత్తి ఇంతగా వ్యాపించి వుండేదికాదనీ, మధ్యలో బడి మానేసే పిల్లల సంఖ్య ఇంత ఎక్కువగా వుండేదికాదని నేను బలంగా అనుకుంటాను. టోమోలో బడి అయిపోగానే ఇంటికి వెళ్లిపోవాలని ఎవరికీ అనిపించేది కాదు. ఉదయంపూట కూడా ఎప్పుడెప్పుడు బడికి చేరుతామా అని మాకెంత ఆత్రంగా వుండేదో...! అటువంటి అద్భుతమైన బడి అది...!'
~ టెట్సుకో కురొయనాగి.
*****
టెట్సుకో కురొయనాగి టోక్యోలో జన్మించింది. అందరికంటే ఎక్కువ ప్రజాదరణవున్న టివీ వ్యాఖ్యాతగా వరుసగా ఐదు సంవత్సరాల పాటు ఎన్నికయింది. చివరికి నటిగా స్థిరపడింది. ఆమె ఈ పుస్తకాన్ని జపనీస్ భాషలో ప్రచురించిన కొద్దిరోజుల్లోనే 45 లక్షల కాపీలు అమ్ముడయి అత్యధిక ప్రజాదరణ పొందిన పుస్తకంగా పేరు సంపాదించుకుంది. ప్రముఖ కవయిత్రి డొరొతి దీనిని ఇంగ్లీషులోకి అనువదించగా ఆ ఇంగ్లీషు ప్రతి కూడా జపాన్‌లో అత్యధికంగా అమ్ముడయిన ఇంగ్లీషు పుస్తకంగా రికార్డు సృష్టించింది. జపాన్‌లో నాలుగు లక్షల ఇంగ్లీషు ప్రతులు అమ్ముడయ్యాయి. ఈ పుస్తకం వల్ల ఆమెకు అనేక పురస్కారాలు, గౌరవాలు లభించాయి. యునిసెఫ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించబడింది.
*****
ఆంగ్లమూలం : First Published in Japanese, translated into English by Dorothy Britton and published as TOTTO-CHAN the little girl at the window.
- Format:Paperback
- Pages:117 pages
- Publication:1989
- Publisher:Hyderabad Book Trust
- Edition:
- Language:tel
- ISBN10:
- ISBN13:
- kindle Asin:B0DM1WDSZQ









