కోతి కొమ్మచ్చి [Koti Kommachi]
ఇది తారీకులవారీ దస్తావేజు కాదు, రచయతగా, సినీనిర్మాతగా,...
Also Available in:
- Amazon
- Audible
- Barnes & Noble
- AbeBooks
- Kobo
More Details
ఇది తారీకులవారీ దస్తావేజు కాదు, రచయతగా, సినీనిర్మాతగా, మహానుభావులతో, మరో-భావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతొ పంచుకుంటూ ఒక రసవద్ఘట్టం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్రమణం చేస్తూ, కొత్తకొత్త పదబంధాలను అల్లుతూ, చమత్కారశైలితో మానని మురిపిస్తూ, ఆ కాలంలోకి తీసుకుపోయి ఆయా మనుషుల మధ్య విహరింపజేశారు రమణ.
కోతి కొమ్మచ్చి చదువుతుంటే లోపలనుండి పొంగుకు వచ్చేది నవ్వో, ఏడుపో తెలీదు. దారిద్ర్యాన్ని ఇంత రొమాంటిక్ గా చూడవచ్చా!? అని ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని ఆకలి జోకులు చదువుతుంటే నవ్వొచ్చి అంతలోనే తమాయించుకుని 'నవ్వకూడదేమో, జాలిపడాలి కాబోసు' అనిపిస్తుంది.
కానీ జాలిపడమని రమణ ఎక్కడా అనలేదు. జీవితంలో అన్నీ చూసిన వేదాంతి నిర్వేదంతో తన జీవితాన్ని పొరపాట్లతో సహా సమీక్షిన్చుకుంటున్నట్లుగా రాసుకుపొయారు. డ్రమటైజ్ చెయ్యవలసిన అవసరం లేకపోయింది. కావలిసంత డ్రామా సహజంగానే వుంది ఆయన జీవితంలో...
- Format:Paperback
- Pages:220 pages
- Publication:2009
- Publisher:Haasam Prachuranalu
- Edition:
- Language:tel
- ISBN10:
- ISBN13:
- kindle Asin:B0DSZYN774